Type Here to Get Search Results !

మెదక్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

 

మెదక్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్న జర్నలిస్టులు

మెదక్, ఆగస్టు 15: మెదక్ ప్రెస్ క్లబ్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎస్. నర్సింహాచారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ జెండాకు వందనం చేసి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నర్సింహాచారి మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం రావడానికి మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్‌సింగ్, సర్దార్ వల్లభభాయ్ పటేల్, అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ తదితరులు చేసిన పోరాటాలు, త్యాగాలు మరువలేనివని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల కృషి, త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామని పేర్కొన్నారు.

దాతల సహకారంతో ప్రెస్ క్లబ్‌లో మౌలిక వసతుల కల్పనకు ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, దాతల సహకారంతో ప్రెస్ క్లబ్ భవనాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జర్నలిస్టులకు అవసరమైన సౌకర్యాలను మెరుగుపరిచేందుకు అందరి సహకారం అవసరమని కోరారు.

ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సెక్రటరీ సంగమేశ్వర్, కోశాధికారి సీహెచ్. అశోక్, గౌరవ అధ్యక్షులు కామటి కృష్ణ, గోపాల్ గౌడ్, సీనియర్ సభ్యులు శ్రీధర్, లక్ష్మీనారాయణ, శంకర్ దయాల్, బీవీకే రాజు, ఫరూక్ హుస్సేన్, కంది శ్రీనివాస్ రెడ్డి, కయ్యం ఎస్., రాజశేఖర్,నాగరాజు,నీలం ,రాజగౌడ్, ఇంతియాజ్, సీహెచ్. రమేష్, సురేందర్ రెడ్డి, మాజీ సెక్రటరీ ప్రసాద్, నర్సింహులు, శ్రీహరి, గోవర్ధన్ రెడ్డి, లక్ష్మణ్,శ్రీరామ్ రహ్మత్ , సందీప్, శ్రీనివాస్, సిద్దు, ఏ. శేఖర్, రాహుల్, కార్తీక్, సుభాష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

తెలుగు ట్రెండ్స్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language