Type Here to Get Search Results !

పాపన్నపేట చేనేత సహకార సంఘం వద్ద ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

 


పాపన్నపేట చేనేత సహకార సంఘం వద్ద ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

చైర్మన్ కొడపాక విఠల్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ

పాపన్నపేట, ఆగస్టు 15: మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘం కార్యాలయం వద్ద 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత సహకార సంఘం చైర్మన్ కొడపాక విఠల్ కొబ్బరికాయ కొట్టి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ జెండాకు వందనం చేసి, స్వాతంత్ర్య దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు.

ఈ సందర్భంగా చైర్మన్ కొడపాక విఠల్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. వారి త్యాగాల ఫలితంగానే మనం నేడు స్వేచ్ఛగా జీవిస్తున్నామని పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు.

చేనేత రంగం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందని, చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సంఘం తరఫున కృషి చేస్తామని తెలిపారు. యువత దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం పాల్గొన్న వారంతా దేశభక్తి నినాదాలు చేస్తూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘం ఉపాధ్యక్షులు పల్లె సంగమేశ్వర్, ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్లు దాసరి యాదగిరి, పల్లె లక్ష్మణ్, జూకంటి సంగయ్య, పద్మశాలి సంఘం మండల అధ్యక్షులు వళ్లందేశీ శ్రీనివాస్, పద్మశాలి నాయకులు పోల శ్రీనివాస్, పల్లె రాములు, శివకుమార్, చామంతుల మల్లయ్య, తూర్పు రాములు, తూర్పు రమేష్, యుగేందర్, బీకొండ రాములు, సంపత్, పల్లె సాయి, రాజేష్, పల్లె రాజు, కొడపాక బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

తెలుగు ట్రెండ్స్, రిపోర్ట్ :శ్రీనివాస్, పాపన్నపేట 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language