Type Here to Get Search Results !

దిడ్గిలో పేకాట స్థావరంపై జహీరాబాద్ రూరల్ పోలీసుల దాడి.. 7 మంది అరెస్ట్

 


దిడ్గిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 7 మంది అరెస్ట్

జహీరాబాద్, ఆగస్టు 12 (తెలుగు ట్రెండ్స్):
దిడ్గి గ్రామంలో అక్రమంగా పేకాట ఆడుతున్న ఏడుగురిని జహీరాబాద్ రూరల్ పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. ఎస్సై రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దిడ్గి గ్రామంలోని ఎం.డి. ఖాజా వ్యవసాయ భూమిలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై దాడి చేశారు.

ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.5,160 నగదు, 52 పేకముక్కలు, 7 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై రాజేందర్ రెడ్డి తెలిపారు.

పేకాట, జూదానికి దూరంగా ఉండాలి

పేకాట, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. ఇలాంటి కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌కు లేదా డయల్ 112కు సమాచారం అందించాలని ఎస్సై రాజేందర్ రెడ్డి కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language