Type Here to Get Search Results !

🌴 ఈత మొక్కలతో గౌడ సంఘం హరిత సంకల్పం.. 500 మొక్కల నాటడం ప్రారంభం

 


ఈత మొక్కలతో గౌడ సంఘం హరిత సంకల్పం

గీత కార్మికుల సంక్షేమానికి ఈత వనాల పెంపు
ఎక్సైజ్ ఎస్‌ఐ విజయ్ సిద్ధార్థ ఆధ్వర్యంలో వనమహోత్సవం

వెల్దుర్తి మండల ప్రతినిధి, ఆగస్టు 12 (తెలుగు ట్రెండ్స్):
గీత వృత్తి పరిరక్షణతో పాటు గీత కార్మికుల జీవనోపాధికి అండగా నిలిచేలా ఈత వనాల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వాలని గౌడ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. రామాయంపేట ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వెల్దుర్తి మండల కేంద్రంలో బుధవారం వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎక్సైజ్ ఎస్‌ఐ విజయ్ సిద్ధార్థ ఆధ్వర్యంలో గౌడ సంఘం నాయకులు ఈత మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎస్‌ఐ విజయ్ సిద్ధార్థ మాట్లాడుతూ.. గీత వృత్తిని పరిరక్షించడంతో పాటు భవిష్యత్ తరాలకు ఈత వనాలను అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో గౌడ సంఘం ఆధ్వర్యంలో సుమారు 500 ఈత మొక్కలను నాటినట్లు తెలిపారు. ఈత చెట్ల పెంపకం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు గీత కార్మికుల జీవనోపాధికి మరింత భరోసా కలుగుతుందని పేర్కొన్నారు.

నాటిన ఈత మొక్కలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, వాటి పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. గీత వృత్తి అభివృద్ధికి అవసరమైన చర్యలకు ఎక్సైజ్ శాఖ తరఫున సహకారం అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వెల్దుర్తి సర్పంచ్ దండం ఆదర్శ్, పంచాయతీ కార్యదర్శి కృష్ణ, ఉప సర్పంచ్ శ్రావణ్ కుమార్, వెల్దుర్తి గౌడ సంఘం నాయకులు జగ్గముత్తా గౌడ్, శాకారం శ్రీనివాస్ గౌడ్, పొన్నం పోతా గౌడ్, నాలచెరువు రవీందర్ గౌడ్, చింతకుంట శేఖర్ గౌడ్, చంద్రశేఖర్ గౌడ్, రవీందర్ గౌడ్, దేవేందర్ గౌడ్, గౌర గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language