Type Here to Get Search Results !

విద్యుత్‌ ప్రమాదంలో మృతి చెందిన వెంకటయ్య కుటుంబానికి అండగా తిరుపతిరెడ్డి బాధిత కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం

 


బాధిత కుటుంబానికి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఆర్థిక సాయం

విద్యుత్‌ ప్రమాదంలో మృతి చెందిన వెంకటయ్య కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక చేయూత

రామాయంపేట, ఆగస్టు 17: విద్యుత్‌ ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబానికి మెదక్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఆర్థిక చేయూత అందించారు. రామాయంపేట మండలంలోని కాట్రియాల్‌ గ్రామానికి చెందిన మైలారం వెంకటయ్య ట్రాన్స్‌ఫార్మర్‌ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు మృతి చెందారు.

వెంకటయ్య మృతి విషయం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తల ద్వారా తెలుసుకున్న కంఠారెడ్డి తిరుపతిరెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం తన వంతు సహాయంగా రూ.5 వేల ఆర్థిక సాయాన్ని అందించారు.

ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. కుటుంబంలో ఒకరిని కోల్పోవడం ఎంతో బాధాకరమైన విషయమని అన్నారు. బాధిత కుటుంబానికి బీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటుందని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. వెంకటయ్య కుటుంబాన్ని ప్రభుత్వం కూడా ఆదుకోవాలని కోరారు.

వెంకటయ్య మృతి పట్ల గ్రామస్థులు, బీఆర్‌ఎస్‌ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. విద్యుత్‌ పనులు, ట్రాన్స్‌ఫార్మర్‌ మరమ్మతుల సమయంలో తగిన భద్రతా చర్యలు పాటించాలని ఈ సందర్భంగా పలువురు సూచించారు.

ఈ కార్యక్రమంలో మాజీ పీఏసీఎస్‌ డైరెక్టర్‌ బిల్లం సాయిరెడ్డి, తిరుపల్లి శ్రీశైలంరెడ్డి, మాజీ ఎంపీటీసీ బిక్షపతి, బసవయ్య, మద్ది ప్రభాకర్‌, బైగారి స్వామి, కమ్మరి సత్యపాల్‌, చింతం విఠల్‌, దప్పు రమేష్‌, మైలారం రవి, మైలారం శ్రీను, మైలారం స్వామి, బాబు తదితరులు పాల్గొన్నారు.

తెలుగు ట్రేండ్స్ రామాయంపేట రిపోర్ట్: బి. యాదగిరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language