Type Here to Get Search Results !

4 నెలలుగా డ్రైనేజీ పనులు.. వ్యాపారులు, ప్రజల అవస్థలు

 


నాలుగు నెలలుగా డ్రైనేజీ పనులు.. వ్యాపారులకు తీవ్ర ఇబ్బందులు

రామాయంపేట: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని వైబీ డెంటల్ హాస్పిటల్ నుంచి పద్మావతి ఆటోమొబైల్ వరకు చేపట్టిన డ్రైనేజీ పనులు నాలుగు నెలలు గడుస్తున్నా పూర్తికాకపోవడంతో వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ మేరకు స్థానిక వ్యాపారులు మున్సిపల్ చైర్మన్, కమిషనర్‌కు వినతిపత్రం అందజేసి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. డ్రైనేజీ పనులు పూర్తికాకపోవడంతో ఈ మార్గంలోని సుమారు 37 దుకాణాల వ్యాపారాలు దెబ్బతింటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దుకాణాలకు వచ్చే వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని, వ్యాపారాలు సక్రమంగా కొనసాగడం లేదని తెలిపారు.

కాంట్రాక్టర్‌తో మాట్లాడి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి రహదారిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ ప్రాంతం పాత హైవే రహదారిని ఆనుకుని ఉండటంతో వాహనదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా సిద్దిపేట వైపు వెళ్లే భారీ వాహనాల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.

ప్రజలు, వ్యాపారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీ పనులను త్వరగా పూర్తి చేసి రహదారిని సౌకర్యవంతంగా మార్చాలని మున్సిపల్ అధికారులను కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language