Type Here to Get Search Results !

సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో 414వ వారం స్వచ్ఛభారత్ కార్యక్రమం మల్కాపూర్‌లో రహదారికి అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు.. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా శ్రమదానం

 



మల్కాపూర్‌లో 414వ వారం స్వచ్ఛభారత్ కార్యక్రమం

తూప్రాన్ మండలం, ఆగస్టు 16 (తెలుగు ట్రెండ్స్): తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 414వ వారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని గ్రామ శివారులో నిర్వహించారు. గ్రామం నుంచి బేగంపేటకు వెళ్లే ప్రధాన రహదారిపై ప్రయాణికులకు, వాహనదారులకు ఇబ్బందికరంగా మారిన చెట్ల కొమ్మలను శ్రమదానం చేసి తొలగించారు.

సుమారు రెండు గంటల పాటు గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో శ్రమదానం చేపట్టి రహదారిపైకి విస్తరించిన చెట్ల కొమ్మలను తొలగించారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగించే సమయంలో చెట్ల కొమ్మలు అడ్డుగా వస్తుండటంతో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తించి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు.

ప్రయాణికుల క్షేమం, వాహనాల సురక్షిత రాకపోకలను దృష్టిలో పెట్టుకొని రహదారి వెంట ఎప్పటికప్పుడు పరిశుభ్రత, భద్రతా చర్యలు చేపడుతున్నామని సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ పేర్కొన్నారు. గ్రామంలో స్వచ్ఛతపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించడంతో పాటు ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు.

స్వచ్ఛభారత్ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామ యువత, పంచాయతీ సిబ్బంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి శ్రమదానం చేయడం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామి, పాలకవర్గ సభ్యులు జిన్న కృష్ణ, ఫీల్డ్ అసిస్టెంట్ కనకరాజు, మేకిన్ యువత, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు  రిపోర్ట్ .R చంద్రశేఖర్ 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language