Type Here to Get Search Results !

రామాయంపేట ప్రధాన రహదారి విస్తరణకు కదిలిన యంత్రాంగం.. 40 అడుగులకు రోడ్డు విస్తరణకు చర్యలు

 


తెలుగు ట్రెండ్స్

రామాయంపేట ప్రధాన రహదారి విస్తరణకు కదిలిన యంత్రాంగం

40 అడుగులకు మెయిన్ రోడ్డు విస్తరణకు చర్యలు.. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు చొరవ

రామాయంపేట: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన రహదారి విస్తరణకు ఎట్టకేలకు యంత్రాంగం కదిలింది. మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్‌రావు చొరవతో మెయిన్ రోడ్డును 40 అడుగులకు విస్తరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రహదారి విస్తరణ పనులను పరిశీలించేందుకు డీటీసీపీ ఆర్డీ అధికారులు రామాయంపేటకు చేరుకుని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

గత కొంతకాలంగా పట్టణంలోని ప్రధాన రహదారి ఇరుకుగా ఉండటంతో వాహనదారులు, వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని రహదారిని 40 అడుగుల మేర విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

రహదారి విస్తరణ పూర్తయితే పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు ప్రజలకు, వ్యాపారులకు మరింత సౌకర్యం కలగనుంది. రామాయంపేట పట్టణ అభివృద్ధికి ఇది మరో కీలక అడుగని నాయకులు పేర్కొన్నారు. అభివృద్ధి పనులకు ప్రజలు, వ్యాపారులు సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు, వైస్ చైర్‌పర్సన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రామాయంపేట రిపోర్టర్: బి. యాదగిరి | తెలుగు ట్రెండ్స్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language