Type Here to Get Search Results !

40 కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గ్రోస్ స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రమం

 40 కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ


స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గ్రోస్ స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రమం


మెదక్: స్వాతంత్ర్య దినోత్సవ మహోత్సవాల సందర్భంగా గ్రోస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 40 కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. గత 12 సంవత్సరాలుగా సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.


ఈ సందర్భంగా సంస్థ సెక్రటరీ జాయ్ మూర్రే మాట్లాడుతూ.. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అవసరంలో ఉన్న కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. గత 12 ఏళ్లుగా నిరంతరం సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని, భవిష్యత్‌లోనూ పేద కుటుంబాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో సునీల్,


ప్రతినిధులు, సభ్యులు పాల్గొని 40 కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందజేశారు.


తెలుగు ట్రెండ్స్ – మెదక్, వికాస్ 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language