Type Here to Get Search Results !

నూతన చేయూత పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. ఆగస్టు 31 చివరి తేదీ

 



నూతన చేయూత పింఛన్లకు దరఖాస్తులు చేసుకోవాలి

ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవాలి.. హెల్ప్‌డెస్క్ ఏర్పాటు

మెదక్, ఆగస్టు 21 (తెలుగు ట్రెండ్స్): నూతన చేయూత పింఛన్ల కోసం అర్హులైన లబ్ధిదారులు ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. నూతన చేయూత పింఛన్ల దరఖాస్తులను మండల, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో స్వీకరిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

దరఖాస్తుల స్వీకరణలో ఏవైనా సమస్యలు ఎదురైతే కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించాలని సూచించారు. ఇందుకోసం 8008556112 నంబర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

అలాగే యూడీఐడీ ధ్రువీకరణ పత్రం లేని దివ్యాంగులు మీ-సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 26న మెదక్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి (GGH)లో దివ్యాంగుల కోసం ప్రత్యేక యూడీఐడీ శిబిరం నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు పొందడంలో సమస్యలు ఎదురైతే హెల్ప్‌డెస్క్ ద్వారా సహాయం అందిస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని దరఖాస్తు చేసుకోవాలని కోరారు. స్వీకరించిన దరఖాస్తులను సకాలంలో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సంబంధిత ఎంపీడీఓలను కలెక్టర్ ఆదేశించారు.

– తెలుగు ట్రెండ్స్, మెదక్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language