🤰 గర్భిణీలకు “మాతృదేవోభవ” కానుక.. 300 మందికి ఉచిత ప్రోటీన్‌ కిట్లు!

 




కొల్చారం గర్భిణీలకు “మాతృదేవోభవ” కానుక

300 మంది గర్భిణీలకు ఉచితంగా ప్రోటీన్‌ కిట్ల పంపిణీ

కొల్చారం, ఆగస్టు 10 (తెలుగు ట్రేండ్స్ )
కొల్చారం మండలంలోని గర్భిణీ స్త్రీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో “మాతృదేవోభవ” కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 300 మంది గర్భిణీ స్త్రీలకు ఉచితంగా ప్రోటీన్‌ కిట్లను పంపిణీ చేశారు.

కొల్చారం మండల కేంద్రంలోని బాబా గార్డెన్స్‌, రంగపేటలోని రంగనాయక ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమాల్లో గర్భిణీలకు ప్రోటీన్‌ కిట్లను అందజేశారు.

ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ.. గర్భిణీ స్త్రీలకు అవసరమైన పోషకాహారం అందించడం ద్వారా తల్లి, బిడ్డ ఆరోగ్యానికి తోడ్పడాలనే ఉద్దేశంతో “మాతృదేవోభవ” కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రతి తల్లి ఆరోగ్యంగా ఉండటం, ప్రతి బిడ్డ ఆరోగ్యంగా జన్మించడం సమాజ బాధ్యత అని పేర్కొన్నారు.

అనంతరం గర్భిణీ స్త్రీలతో కలిసి ఆవుల రాజిరెడ్డి భోజనం చేశారు. ఈ సందర్భంగా వారితో ఆప్యాయంగా మాట్లాడి ఆరోగ్య పరిస్థితులు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు.

కార్యక్రమంలో కొల్చారం మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు నాగులగారి మల్లేశం గౌడ్‌, ఉపాధ్యక్షుడు ముత్యం గారి గోవర్ధన్‌, ప్రధాన కార్యదర్శి గంగసాని మహేశ్వర్‌ రెడ్డి, మాజీ బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ రెడ్డి, సర్పంచులు చందాపురం మధుసూదన్‌ రెడ్డి, నాయిని వెంకట్‌ గౌడ్‌, నెల్లి సంగమేశ్వర్‌, రంగంపేట మాజీ సర్పంచ్‌ బండి సుజాత రమేష్‌, రంగంపేట గ్రామ శాఖ అధ్యక్షుడు గోండ కృష్ణ, కొల్చారం గ్రామ శాఖ అధ్యక్షుడు ఆశన్నగారి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

అలాగే కాంగ్రెస్‌ పార్టీ నాయకులు జనార్దన్‌ రెడ్డి, అంజా గౌడ్‌, రామకృష్ణారెడ్డి, పహాడ్‌, శ్రీశైలం, కొమ్ముల రవీందర్‌ గౌడ్‌, కోట శ్రావణ్‌, వెంకట్‌ గౌడ్‌, ఊరడి విజయ్‌ అశోక్‌, అయిలి నవీన్‌, దర్జీ రాజు, ఆగం గౌడ్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, మహిళలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

— తెలుగు ట్రెండ్స్

0/Post a Comment/Comments

ads

ads