Type Here to Get Search Results !

శీర్షిక లేదు

 శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల మహోత్సవంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు పాల్గొనడం


రామాయంపేట: పట్టణంలోని 3వ వార్డు రైతు బజార్ సమీపంలో ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో ఘనంగా నిర్వహించిన పవిత్ర బోనాల మహోత్సవం, అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో రామాయంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి గజవాడ లావణ్య నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.


ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గుగులోతు రవి, దేవుని రంజిత్, శంకర్ గౌడ్, మున్సిపల్ వైస్ ప్రెసిడెంట్ చింతల యాదగిరి, మాజీ పట్టణ అధ్యక్షుడు దాకి స్వామి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతల స్వామి, మట్టి యాదగిరి, సుకుమార్, సుంకోజు దామోదర్, సుందర్ సింగ్, మోబిన్, మధునాల స్వామి గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు చిలుక విరాట్, భాను ప్రసాద్, దేవుని నరేష్, నరేందర్, సాయి తేజ, సుధీర్ గౌడ్, సోహెల్, గణేష్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు మాట్లాడుతూ, శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు వెల్లివిరియాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language