Type Here to Get Search Results !

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డాక్టర్ మోహన్ నాయక్ ఆపరేషన్ చేయించుకున్న లాలుకు రూ.25 వేల ఆర్థిక సాయం

 

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డాక్టర్ మోహన్ నాయక్

ఆపరేషన్ చేయించుకున్న లాలుకు రూ.25 వేల ఆర్థిక సహాయం

చేగుంట, ఆగస్టు 17: ఇచ్చిన మాటకు కట్టుబడి ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్. దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన లాలు ఆరోగ్య సమస్యతో ఆస్పత్రిలో చేరి ఇటీవల ఆపరేషన్ చేయించుకున్నారు.

లాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న డాక్టర్ మోహన్ నాయక్ ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా లాలు డిశ్చార్జ్ అయ్యే సమయంలో ఆర్థిక సహాయం అందిస్తానని డాక్టర్ మోహన్ నాయక్ హామీ ఇచ్చారు.

ఇచ్చిన మాట ప్రకారం లాలు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రోజున డాక్టర్ మోహన్ నాయక్ రూ.25 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆపరేషన్ అనంతరం కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఈ సహాయం అందించడం వారికి ఎంతో ఊరటనిచ్చింది.

ఆపద సమయంలో తమకు అండగా నిలిచి, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న డాక్టర్ మోహన్ నాయక్‌కు లాలు కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థికంగా, మానసికంగా అండగా నిలవడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బాల్య, రాజు, బాల్‌సింగ్, సామ్య నాయక్, తారాసింగ్, బాలకృష్ణతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

తెలుగు ట్రేండ్స్ చేగుంట రిపోర్ట్ బి యాదగిరి 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language