Type Here to Get Search Results !

విద్యార్థులకు డిజిటల్ విద్య కోసం సర్పంచ్ నాయిని వెంకట్ గౌడ్ సేవాభావం అప్పాజీపల్లి పాఠశాలకు రూ.25 వేల విలువైన ప్రొజెక్టర్, స్క్రీన్ అందజేత

 


అప్పాజీపల్లి పాఠశాలకు ప్రొజెక్టర్, స్క్రీన్ అందజేత

కొల్చారం, ఆగస్టు 16 (తెలుగు ట్రెండ్స్): కొల్చారం మండలం అప్పాజీపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రీ-ప్రైమరీ, ప్రాథమిక విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యను అందించేందుకు గ్రామ సర్పంచ్ నాయిని వెంకట్ గౌడ్ ముందుకు వచ్చారు. పాఠశాలకు సుమారు రూ.25 వేల విలువైన ప్రొజెక్టర్, స్క్రీన్‌ను సర్పంచ్ అందజేశారు.

విద్యార్థులకు పాఠ్యాంశాలను మరింత సులభంగా, ఆసక్తికరంగా అర్థమయ్యేలా డిజిటల్ విధానంలో బోధించేందుకు ఈ సదుపాయం ఉపయోగపడనుంది. ప్రొజెక్టర్, స్క్రీన్ ద్వారా పాఠ్యాంశాలను దృశ్యరూపంలో వివరించడం వల్ల విద్యార్థుల్లో ఆసక్తి పెరగడంతో పాటు, విషయాలను సులభంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని సర్పంచ్ తెలిపారు.

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా ఆధునిక సాంకేతిక విద్యా సదుపాయాలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రొజెక్టర్, స్క్రీన్‌ను పాఠశాలకు అందించినట్లు నాయిని వెంకట్ గౌడ్ పేర్కొన్నారు. విద్యార్థులు సాంకేతికతను సద్వినియోగం చేసుకుని విద్యలో రాణించాలని ఆకాంక్షించారు.

పాఠశాలకు అవసరమైన సదుపాయాన్ని అందించిన సర్పంచ్ నాయిని వెంకట్ గౌడ్‌కు ఉపాధ్యాయులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి భవిష్యత్తులోనూ సహకారం అందించాలని కోరారు.           రిపోర్ట్ :ముత్తయ్య 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language