Type Here to Get Search Results !

రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి మైనంపల్లి అండ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి రూ.2 లక్షల ఆర్థిక సాయం

 



రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికి మైనంపల్లి అండ

బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.2 లక్షల ఆర్థిక సాయం

పాపన్నపేట, ఆగస్టు 11 (తెలుగు ట్రెండ్స్):

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాన్ని కాంగ్రెస్ సీనియర్ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు పరామర్శించి అండగా నిలిచారు. పాపన్నపేట మండలానికి చెందిన మాజీ ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్ సోదరుడు ఆకుల కృష్ణ సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలుసుకున్న మైనంపల్లి హనుమంతరావు మంగళవారం వారి నివాసానికి వెళ్లారు.

ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో కుటుంబ సభ్యుడిని కోల్పోవడం బాధాకరమని, ఈ కష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.

బాధిత కుటుంబానికి తన వంతు సహాయంగా రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ, దివంగతుడు ఆకుల కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

కుటుంబానికి అండగా ఉంటామని హామీ

ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ ప్రమాదంలో కుటుంబ సభ్యుడిని కోల్పోవడం తీవ్ర విషాదకరమని, బాధిత కుటుంబానికి అవసరమైన సమయంలో అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ గౌడ్తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language