Type Here to Get Search Results !

బస్వాపూర్‌లో 16 సీసీ కెమెరాలు ఏర్పాటు.. నేరాల నియంత్రణకు ‘సురక్ష నేత్ర’**

 

బస్వాపూర్‌లో 16 సీసీ కెమెరాల ఏర్పాటు.. నేరాల నియంత్రణకు ‘సురక్ష నేత్ర’ కార్యక్రమం

కోహెడ, ఆగస్టు 12 (తెలుగు ట్రెండ్స్):
సిద్దిపేట జిల్లాలో నేరాల నియంత్రణ, డ్రగ్స్ నిర్మూలన, రోడ్డు భద్రతపై పోలీస్ శాఖ అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేస్తోంది. ఇందులో భాగంగా కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో ‘సురక్ష నేత్ర’ కార్యక్రమం కింద ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలను హుస్నాబాద్ ఏసీపీ ఎస్. సదానందం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏసీపీ సదానందం గ్రామ ప్రజలకు సీసీ కెమెరాల ప్రాధాన్యత, డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ప్రజల సహకారంతో జిల్లాలో ‘సురక్ష నేత్ర’ కార్యక్రమం కింద కొత్త సీసీ కెమెరాల ఏర్పాటు కొనసాగుతోందని తెలిపారు.

నేరాల నియంత్రణ, నిందితుల గుర్తింపు, శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలకంగా పనిచేస్తాయని పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే జిల్లా పోలీస్ శాఖ లక్ష్యమని, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

డ్రగ్స్ లేదా గంజాయి విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, అతివేగం, రాంగ్‌రూట్ ప్రయాణాలను నివారించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కోహెడ ఎస్సై అభిలాష్, విలేజ్ పోలీస్ ఆఫీసర్ మోహన్, గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language