Type Here to Get Search Results !

ప్రజావాణికి 16 మంది అధికారులు హాజరు.. మూడు ఫిర్యాదులు

 

ప్రజావాణికి 16 మంది అధికారులు హాజరు.. మూడు ఫిర్యాదులు

తూప్రాన్, ఆగస్టు 18 (తెలుగు ట్రెండ్స్): ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు పూర్తి స్థాయిలో హాజరయ్యారు. మొత్తం 16 మంది అధికారులు పాల్గొనగా, ఒక్క అధికారి కూడా గైర్హాజరు కాలేదని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, ఎంపీఓ, మెడికల్ ఆఫీసర్, ఏఈ పీఆర్, ఏఈ ఐబీ, ఏఈ ఆర్‌డబ్ల్యూఎస్, డిప్యూటీ తహసీల్దార్, ఏఈఓ వ్యవసాయం, ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్


అధికారి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్, ఏఈ హౌసింగ్, ఏపీఎం ఐకేపీ, ఏపీఓ తదితర అధికారులు హాజరయ్యారు.

ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం మూడు దరఖాస్తులు అందాయి. కాళ్లకల్ గ్రామంలోని సర్వే నంబర్ 148లో ఇండస్ట్రీ ప్లాట్‌లో అక్రమంగా లీజులు ఇచ్చినట్లు మొదటి ఫిర్యాదు అందింది. నర్సింహ వే బ్రిడ్జి, మంజీర వైన్స్, అనిల్ కూల్ డ్రింక్స్, చికెన్ సెంటర్ తదితరాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

కోనాయపల్లి పీటీ శివారులోని శ్రీరాజ్ అల్యూమినియం కంపెనీ నుంచి పొగ, దుర్వాసన వస్తోందని రెండో ఫిర్యాదు అందింది. దీనిపై సంబంధిత అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు.

రంగాయపల్లి, చెట్లగౌరారం పరిధిలో ఎంఎస్ అగర్వాల్ సంస్థ విస్తరణను నిలిపివేయాలని కోరుతూ మూడో ఫిర్యాదు అందింది. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.

తూప్రాన్ రిపోర్టర్: ఆర్. చంద్రశేఖర్
తెలుగు ట్రెండ్స్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language