Type Here to Get Search Results !

మంబోజిపల్లిలో ఏటీఎం చోరీ.. రూ.14.50 లక్షలు దోచుకెళ్లిన దుండగులు


 


ఏటీఎంను బద్దలుకొట్టి.. రూ.14.50 లక్షలు మాయం

మెదక్: అర్ధరాత్రి వేళ ఏటీఎంను టార్గెట్ చేసిన దుండగులు భారీ మొత్తంలో నగదును ఎత్తుకెళ్లిన ఘటన మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంబోజిపల్లిలో చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో ఎస్‌బీఐ ఏటీఎంలోకి ప్రవేశించిన దుండగులు మిషన్‌ను ధ్వంసం చేసి అందులోని రూ.14 లక్షల 50 వేల నగదును అపహరించినట్లు సమాచారం.

చోరీ అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ మొత్తం వ్యవహారం ఏటీఎంలోని సీసీ కెమెరాల్లో రికార్డైనట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

చోరీకి ఉపయోగించిన విధానం, నిందితుల కదలికలను గుర్తించేందుకు పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు. క్లూస్ టీం కూడా సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరించింది. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు.

ఘటనపై ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, డీఎస్పీ ప్రసన్నకుమార్, రూరల్ సీఐ కృష్ణమూర్తి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఏటీఎంలో నగదు భద్రత, రాత్రి వేళల్లో భద్రతా ఏర్పాట్లపై కూడా అధికారులు ఆరా తీశారు.

ఈ ఘటనతో మంబోజిపల్లి పరిసర ప్రాంతాల్లో కలకలం నెలకొంది. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించి త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

తెలుగు ట్రెండ్స్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language