Type Here to Get Search Results !

శీర్షిక లేదు

 రంగంపేటలో రేపు ‘హర్ ఘర్ తిరంగా’ యాత్ర


కుల, మత, ప్రాంతాలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడి పిలుపు


కొల్చారం, ఆగస్టు 13 (తెలుగు ట్రెండ్స్):

కొల్చారం మండలంలోని రంగంపేట గ్రామంలో రేపు ‘హర్ ఘర్ తిరంగా’ యాత్ర నిర్వహించనున్నట్లు బీజేపీ కొల్చారం మండల అధ్యక్షుడు హరీష్ ఘనాపూర్ తెలిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.


దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటేలా నిర్వహించనున్న ఈ యాత్రలో కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని హరీష్ ఘనాపూర్ పిలుపునిచ్చారు. జాతీయ జెండా ప్రాధాన్యతను ప్రజల్లో చాటిచెప్పడంతో పాటు దేశ ఐక్యత, సమైక్యతను ప్రతిబింబించేలా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.


రంగంపేట గ్రామ ప్రజలు, యువత, మహిళలు, అన్ని వర్గాల వారు పెద్ద సంఖ్యలో పాల్గొని ‘హర్ ఘర్ తిరంగా’ యాత్రను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


ఈ మేరకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language