Type Here to Get Search Results !

అనాథ బాలికకు అండగా డాక్టర్ మోహన్ నాయక్ చిన్నారి భవిష్యత్ కోసం రూ.10 వేల ఫిక్స్‌డ్ డిపాజిట్

 


అనాథ బాలికకు అండగా డాక్టర్ మోహన్ నాయక్

చిన్నారి భవిష్యత్ కోసం రూ.10 వేల ఫిక్స్‌డ్ డిపాజిట్ బాండ్ అందజేత

రామాయంపేట, ఆగస్టు 11:
రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామానికి చెందిన విశాల్ క్యాన్సర్‌తో బాధపడుతూ మృతి చెందడంతో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది. తండ్రిని కోల్పోయిన ఆయన కుమార్తెకు అండగా నిలిచేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ ముందుకు వచ్చారు.

గతంలో కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేసిన సమయంలో చిన్నారి భవిష్యత్‌ కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తానని డాక్టర్ మోహన్ నాయక్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మంగళవారం ప్రగతి ధర్మారం గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

అనంతరం మృతుడు విశాల్ కుమార్తె పేరుపై రూ.10 వేల ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయించి, అందుకు సంబంధించిన బాండ్‌ను కుటుంబ సభ్యులకు అందజేశారు. చిన్నారి భవిష్యత్‌కు తనవంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని డాక్టర్ మోహన్ నాయక్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ సిద్ధరాం రెడ్డి, ఉప సర్పంచ్ రమేష్, వార్డు సభ్యుడు కట్ట మహేష్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నాగరాజ్, సివిల్ ఇంజనీర్ దొమ్మాట రవీందర్, రొడ్డ రవి, నింగరమైన బాలరాజు, గాండ్ల స్వామి, గొల్ల స్వామి, సురేష్, రాజు, బాలకృష్ణతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

— తెలుగు ట్రెండ్స్ | రామాయంపేట

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language