Type Here to Get Search Results !

లేబర్ కోడ్స్ రద్దు చేయాలి.. ఆగస్టు 10న జైల్ భరో: పాలడుగు సుధాకర్


మెదక్‌లో సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల విస్తృత సమావేశం

ఆగస్టు 10 జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు

తెలుగు ట్రెండ్స్ | మెదక్
తేదీ: 01-08-2026

మెదక్‌లోని కేవల్ కిషన్ భవన్‌లో సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లా విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు లేబర్ కోడ్స్ కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని విమర్శించారు.

కార్మిక చట్టాలను రద్దు చేసి తీసుకొచ్చిన ఈ కోడ్స్ వల్ల పనిగంటలు పెరిగాయని, కార్మిక సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కులు బలహీనపడుతున్నాయని అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాన్ని రూ.26 వేలుగా నిర్ణయించాలని, 2025 విద్యుత్ సవరణ బిల్లు, విత్తన చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 200 రోజుల పని కల్పించి రోజువారీ వేతనాన్ని రూ.600కు పెంచాలని కోరారు. అలాగే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మార్పులను వ్యతిరేకిస్తూ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్పొరేట్ విధానాలు, మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా ఆగస్టు 10న నిర్వహించే జైల్ భరో కార్యక్రమంలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మూడు సంఘాల తరఫున విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎ. మల్లేశం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె. మల్లేశం, సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ, జిల్లా ఉపాధ్యక్షులు సంతోష్, మహేందర్ రెడ్డి, నాగరాజు, ఎన్‌పీఆర్‌డీ జిల్లా కార్యదర్శి యశోద, నాయకులు దుర్గా, కవిత, బాబు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

— తెలుగు ట్రెండ్స్


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language