Type Here to Get Search Results !

చర్చకు రమ్మంటే ముఖం చాటేసిన కాంగ్రెస్

 


హైదరాబాద్: చర్చకు రావాలని ఆహ్వానించి, అనంతరం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు ఇతర బీఆర్ఎస్ నాయకులను పోలీసులు  హైదరాబాద్అ లోని తెలంగాణ భవాన్ వద్ద అడ్డుకోవడం అక్రమంగా అరెస్టు చేయించడం కాంగ్రెస్ ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమని బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేసింది.

కాంగ్రెస్ నాయకులు అవినీతికి పాల్పడలేదని చెబుతున్నట్లయితే, చర్చకు వస్తున్న ప్రతిపక్ష నాయకులను పోలీసులను అడ్డం పెట్టుకుని ఎందుకు అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ ప్రశ్నించింది. సవాల్ విసిరి చివరకు వెనకడుగు వేయడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని, ప్రజాస్వామ్య విలువల పట్ల నిర్లక్ష్యాన్ని బయటపెడుతోందని ఆరోపించింది.

ప్రతిపక్షాన్ని పోలీసుల ద్వారా అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్న బీఆర్ఎస్, ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించి ప్రజల ముందే చర్చకు రావాలని డిమాండ్ చేసింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language