Type Here to Get Search Results !

🚨 హైదరాబాద్‌లో ఫుడ్ ఫ్రాడ్.. మటన్ పేరుతో బీఫ్ విక్రయం – ఇద్దరు అరెస్ట్

 

మటన్ పేరుతో బీఫ్ సరఫరా.. హైదరాబాద్‌లో ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్, జూలై 2: నగరంలోని పలు హోటళ్లకు మటన్ పేరుతో బీఫ్ సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS), హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (H-FAST) సంయుక్తంగా అరెస్ట్ చేసింది.

సమాచారం మేరకు దాడులు నిర్వహించిన పోలీసులు సుమారు 50 కిలోల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మాంసాన్ని పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు.

ప్రాథమిక విచారణలో తక్కువ ధరకు బీఫ్ కొనుగోలు చేసి, దానిని మటన్‌గా చూపిస్తూ నగరంలోని కొన్ని హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ వ్యవహారంలో మరెవరైనా ప్రమేయం ఉందా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

గమనిక: అరెస్టయిన ఇద్దరి పేర్లు, వారు ఏ ప్రాంతానికి చెందినవారన్న వివరాలను పోలీసులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language