నిరుద్యోగులకు శుభవార్త.. రైల్వేలో 6,557 పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల

 


రైల్వేలో 6,557 పోస్టుల భర్తీకి RRB నోటిఫికేషన్ విడుదల

న్యూఢిల్లీ, జూన్ 29: భారతీయ రైల్వే శాఖ భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 6,557 పోస్టులను భర్తీ చేయనున్నట్లు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ప్రకటించింది.

ఈ నియామకాల్లో టెక్నీషియన్ గ్రేడ్-1 (సిగ్నల్) విభాగంలో 323 పోస్టులు, టెక్నీషియన్ గ్రేడ్-3 విభాగంలో 6,234 పోస్టులు ఉన్నాయి.

ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్ 30 నుంచి జూలై 29 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి:

  • టెక్నీషియన్ గ్రేడ్-1 (సిగ్నల్): 18 నుంచి 33 సంవత్సరాలు
  • టెక్నీషియన్ గ్రేడ్-3: 18 నుంచి 30 సంవత్సరాలు

అర్హతలు, విద్యార్హతలు, ఎంపిక విధానం, పరీక్ష వివరాలు తదితర పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక RRB వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.

0/Post a Comment/Comments

ads

ads