Type Here to Get Search Results !

డబ్బుల విషయంలో కుటుంబ కలహాలు.. పురుగుల మందు సేవించి వ్యక్తి మృతి

 


రిపోర్టర్: పి. శ్రీనివాస్

పురుగుల మందు సేవించి వ్యక్తి మృతి

తెలుగు ట్రెండ్స్ – పాపన్నపేట, ఆగస్టు 24:

పురుగుల మందు సేవించి ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన పాపన్నపేట మండల పరిధిలోని నర్సింగరావుపల్లి తండాలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింగరావుపల్లి తండాకు చెందిన కేతావత్ తౌర్యా (32) కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు.

తరచూ పనులకు వెళ్లకుండా ఖర్చుల కోసం డబ్బులు ఇవ్వాలని తల్లి, భార్యతో గొడవపడేవాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఈ నెల 22వ తేదీ రాత్రి డబ్బుల విషయంలో తల్లి హేమ్లీ, భార్య సునీతతో తౌర్యా గొడవపడ్డాడు.

మరుసటి రోజు ఉదయం తల్లి హేమ్లీ తన కుమార్తె ఇంటికి వెళ్లగా, భార్య సునీత కూలీ పనులకు వెళ్లింది. ఆ సమయంలో తౌర్యా ఇంటి నుంచి బయటకు వెళ్లి పాపన్నపేట గ్రామ శివారులోని చెరువు కట్ట వద్ద గుర్తుతెలియని పురుగుల మందు సేవించి అపస్మారక స్థితిలో పడిపోయాడు.

స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని తౌర్యాను చికిత్స నిమిత్తం మెదక్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి (GGH)కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

మృతుడి తల్లి హేమ్లీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

రిపోర్టర్: పి. శ్రీనివాస్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language