రిపోర్టర్: ఆర్. చంద్రశేఖర్
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి: బీజేపీ
రాష్ట్ర అధ్యక్షుడి దీక్షకు మద్దతుగా బీజేపీ నాయకుల సంఘీభావం
తెలుగు ట్రెండ్స్ – తూప్రాన్, ఆగస్టు 24:
విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నత్తి మల్లేష్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. ఫీజు బకాయిల విడుదల కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారాపు రామచంద్ర రావు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో చేపట్టిన రెండు రోజుల దీక్షకు మద్దతుగా ఆయన పాల్గొని సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా నత్తి మల్లేష్ ముదిరాజ్ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని విడుదల చేయాలని కోరారు.
ఫీజు బకాయిల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్యార్థుల హక్కుల కోసం బీజేపీ నిరంతరం పోరాడుతుందని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పూర్తిగా విడుదల చేసే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సింఘం సత్యయ్య, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్ ముదిరాజ్, కౌన్సిలర్ చందా అశోక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: ఆర్. చంద్రశేఖర్


కామెంట్‌ను పోస్ట్ చేయండి