రంగంపేట మాజీ సర్పంచ్‌ భర్త బండి రమేష్‌కు బీఆర్‌ఎస్‌ నేతల సవాల్‌ రచ్చబండకు రండి.. ఆరోపణలపై ఆధారాలతో చర్చిద్దాం

 



రంగంపేట మాజీ సర్పంచ్‌ భర్త బండి రమేష్‌ రచ్చబండకు సిద్ధమా?

రచ్చబండకు వస్తే గత ఐదేళ్ల వ్యవహారాలపై ఆధారాలతో చర్చిద్దాం: బీఆర్‌ఎస్‌ నాయకులు

కొల్చారం, ఆగస్టు 26 (నవ పలుకులు): మెదక్‌ జిల్లా కొల్చారం మండలం రంగంపేటకు చెందిన మాజీ సర్పంచ్‌ భర్త బండి రమేష్‌పై బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రంగంపేటలో బుధవారం డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ అరిగే రమేష్‌కుమార్‌ ఫామ్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్‌ఎస్‌ నాయకులు మాట్లాడారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అరిగే రమేష్‌కుమార్‌పై బండి రమేష్‌ చేసిన విమర్శలు సరికావని అన్నారు. గతంలో గ్రామంలో జరిగిన పలు వ్యవహారాలపై తమ వద్ద సమాచారం ఉందని, తాము చేసిన ఆరోపణలకు ఆధారాలతో సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ నెల 29న శనివారం రంగంపేటలో నిర్వహించనున్న రచ్చబండ కార్యక్రమానికి రావాలని బండి రమేష్‌కు సవాల్‌ విసిరారు.

బీసీ కార్పొరేషన్‌ రుణాల విషయంలో పర్సంటేజీల వసూళ్లకు పాల్పడ్డారంటూ రవీందర్‌గౌడ్‌పై కూడా వారు ఆరోపణలు చేశారు. సీనియర్‌ నాయకులపై విమర్శలు చేసే ముందు గతంలో జరిగిన వ్యవహారాలపై సమాధానం చెప్పాలని అన్నారు. రచ్చబండ వేదికగా అన్ని విషయాలను ప్రజల సమక్షంలో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

రంగంపేట ఉపసర్పంచ్‌ చిట్కుల సురేష్‌ మాట్లాడుతూ.. మాజీ సర్పంచ్‌ బండి సుజాత, ఆమె భర్త బండి రమేష్‌ హయాంలో జరిగిన వ్యవహారాలపై తమకు పూర్తి సమాచారం ఉందని అన్నారు. రచ్చబండ కార్యక్రమంలో అవసరమైన ఆధారాలతో విషయాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్‌ కార్యకర్త గామని గంగయ్య మాట్లాడుతూ.. ఏదో ఒక నాయకుడి అనుచరుడని, బ్రోకర్‌ అని విమర్శించడం సరికాదన్నారు. అరిగే రమేష్‌కుమార్‌పై చేసిన ఆరోపణలను ఆధారాలతో నిరూపించాలని డిమాండ్‌ చేశారు. అలాగే మాజీ సర్పంచ్‌ కుటుంబానికి సంబంధించిన ఆరోపణలపై కూడా ప్రజల సమక్షంలో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

బీఆర్‌ఎస్‌ నాయకులు మాట్లాడుతూ.. అరిగే రమేష్‌కుమార్‌ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుని వచ్చి రంగంపేటలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేశారని అన్నారు. తన కష్టార్జితంతో సర్వే నంబర్‌ 204లో భూములు కొనుగోలు చేశారని పేర్కొన్నారు. ఆయనతో కలిసి పనిచేసిన పలువురు కార్యకర్తలు ప్రస్తుతం కాంగ్రెస్‌లో నాయకులుగా ఎదిగారని తెలిపారు.

ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ యూత్‌ అధ్యక్షుడు ఇసుక సుధాకర్‌, రంగంపేట మాజీ సర్పంచ్‌ విజయ్‌, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు గామని గంగాధర్‌, ఎలుక గంగులు, గోపిగారి సత్యాగౌడ్‌, ఆరేటి మల్లేశం, నీలకంటి ప్రవీణ్‌, గామని గంగారం, శివరాములు, బక్కప్ప, గోకర్‌ నరసింహులు, రాయిని మల్లేశం, రమేష్‌, బోయి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

నవ పలుకులు – రిపోర్టర్‌: ముత్తయ్య, కొల్చారం

0/Post a Comment/Comments

ads

ads