ఫీజు బకాయిల విడుదల కోసం బీజేపీ దీక్ష
ఫీజు బకాయి బీజేపీ లడాయి కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన కిసాన్ మోర్చా అధ్యక్షుడు
మెదక్, ఆగస్టు 25 (నవ పలుకులు): విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు చేపట్టిన నిరాహార దీక్షకు మెదక్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు బైండ్ల సత్యనారాయణ ముదిరాజ్ సంఘీభావం తెలిపారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఫీజు బకాయి బీజేపీ లడాయి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బైండ్ల సత్యనారాయణ మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో విద్యార్థులు, వారి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ఆలస్యం చేయకుండా చెల్లించాలని సూచించారు. ప్రభుత్వం సమస్యను పరిష్కరించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు.
దీక్ష కార్యక్రమంలో కిసాన్ మోర్చా కమిటీ సభ్యులు పూర్తి స్థాయిలో పాల్గొని సంఘీభావం తెలిపారు.
ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కిసాన్ మోర్చా జిల్లా కమిటీ జనరల్ సెక్రటరీ ఆకుల ప్రభాకర్, శ్యామ్, రమేష్, ఉపాధ్యక్షుడు రాజు, శ్రీనివాస్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులు చంద్రన్, కార్తీక్, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు బాల్ లింగం, శ్రీకాంత్, మెదక్ పట్టణ కిసాన్ మోర్చా అధ్యక్షులు గోవిందరాజు, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: పి. శ్రీనివాస్
నవ పలుకులు – పాపన్నపేట


కామెంట్‌ను పోస్ట్ చేయండి