Type Here to Get Search Results !

ముసాయిదా ఓటరు జాబితాపై గ్రామసభ ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండాలి: ఆవుల రాజిరెడ్డి

 



ముసాయిదా ఓటరు జాబితాపై గ్రామసభ

ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలి

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించిన ఆవుల రాజిరెడ్డి

మాసాయిపేట, ఆగస్టు 27 (నవ పలుకులు): ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటరు జాబితాపై మాసాయిపేట మండల కేంద్రంలో గురువారం గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఆవుల రాజిరెడ్డి, నర్సాపూర్‌ ఎస్‌ఐఆర్‌ కోఆర్డినేటర్‌ అన్వేష్‌రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించిన ఆవుల రాజిరెడ్డి.. ఓటర్ల పేర్ల నమోదు, తొలగింపు, మార్పులు, చేర్పులకు సంబంధించిన వివరాలను ప్రజలకు వివరించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ప్రజలకు పూర్తి అవగాహన ఉండాలని, ఓటర్లు తమ వివరాలను స్వయంగా పరిశీలించుకోవాలని ఆయన కోరారు. ముసాయిదా జాబితాలో పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, ఇతర వివరాల్లో ఏమైనా తప్పులు ఉంటే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

అనంతరం ఎస్‌ఐఆర్‌ కోఆర్డినేటర్‌ అన్వేష్‌రెడ్డి మాట్లాడుతూ.. ముసాయిదా ఓటరు జాబితాను ప్రతి ఓటరు తప్పనిసరిగా పరిశీలించుకోవాలని తెలిపారు. వివరాల్లో మార్పులు, చేర్పులు లేదా ఏవైనా అభ్యంతరాలు ఉంటే నిర్ణీత ప్రక్రియ ప్రకారం అధికారులకు తెలియజేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటరుకు జాబితాలో స్థానం కల్పించడంతో పాటు, ఓటు హక్కుకు సంబంధించిన వివరాలను సరిచూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో చురుగ్గా పాల్గొని తమ ఓటు హక్కును కాపాడుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా ప్రజలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాసాయిపేట సర్పంచ్‌ కృష్ణారెడ్డి, తహసీల్దార్‌ జ్ఞానజ్యోతి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు సిద్ధిరాములు గౌడ్‌, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి, అంగన్‌వాడీ టీచర్లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

నవ పలుకులు – రిపోర్టర్‌: ఎన్‌. నర్సింహా గౌడ్‌, వెల్దుర్తి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language