Type Here to Get Search Results !

బాధిత కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం.. కంఠ రెడ్డి తిరుపతి రెడ్డి

 


రిపోర్టర్: పి. శ్రీనివాస్

పుట్టి మానెమ్మ కుటుంబానికి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఆర్థిక సాయం

మృతి చెందిన కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక తోడ్పాటు

తెలుగు ట్రెండ్స్ – పాపన్నపేట, ఆగస్టు 24:

పాపన్నపేట మండల పరిధిలోని చిత్రియాల గ్రామానికి చెందిన పుట్టి మానెమ్మ మృతి చెందడం పట్ల బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి పార్టీ నాయకుల ద్వారా రూ.5 వేల ఆర్థిక సాయాన్ని అందజేసి అండగా నిలిచారు.

ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. కుటుంబ పెద్దను కోల్పోయిన మానెమ్మ కుటుంబానికి ఈ కష్ట సమయంలో పార్టీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు చేయూత అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు.

బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన నాయకులు వారికి ధైర్యం చెప్పారు. గ్రామస్థులు కూడా మానెమ్మ కుటుంబానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బైరి సురేష్, ఏడుపాయల దేవస్థానం మాజీ చైర్మన్ సాతెల్లి బాలాగౌడ్, పీఏసీఎస్ డైరెక్టర్ బైరి లక్ష్మీనారాయణ, బీఆర్‌ఎస్ నాయకులు బైరి శేకయ్య, పొట్టి శేకయ్య, అక్బర్, పుట్టి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language