తూప్రాన్ టోల్‌ప్లాజా వద్ద 300 గ్రాముల పాపీ స్ట్రా పౌడర్ స్వాధీనం
తూప్రాన్, ఆగస్టు 23 (తెలుగు ట్రెండ్స్): అక్రమంగా తరలిస్తున్న 300 గ్రాముల పాపీ స్ట్రా పౌడర్‌ను అబ్కారీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తూప్రాన్ టోల్‌ప్లాజా వద్ద వాహనాల తనిఖీల్లో ఈ మాదక పదార్థం పట్టుబడినట్లు అధికారులు తెలిపారు.
మెదక్ జిల్లా అబ్కారీ అధికారి శ్రీ నరసింహారెడ్డి ఆదేశాల మేరకు నర్సాపూర్ అబ్కారీ సీఐ గులాం ముస్తఫా ఆధ్వర్యంలో తూప్రాన్ టోల్‌ప్లాజా వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 300 గ్రాముల పాపీ స్ట్రా పౌడర్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కొలేశ్వర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మాదక పదార్థం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడికి తరలిస్తున్నారు అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.
తనిఖీల్లో ఎస్ఐలు రాఘవేంద్రరావు, ఖాజా అజీజ్ అహ్మద్, అబ్కారీ స్టేషన్ నర్సాపూర్ సిబ్బంది రవీ, హెడ్ కానిస్టేబుల్ రాశేకర్, కానిస్టేబుళ్లు షాహిద్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ డీటీఎఫ్ ఎస్ఐ బాలయ్యతో పాటు డీటీఎఫ్ సిబ్బంది కూడా తనిఖీల్లో పాల్గొన్నారు.
అక్రమ మాదక పదార్థాల రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అబ్కారీ సీఐ గులాం ముస్తఫా హెచ్చరించారు. యువత మాదక పదార్థాలకు దూరంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పాపీ స్ట్రా పౌడర్ స్వాధీనం కేసులో దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.
తెలుగు ట్రెండ్స్ – తూప్రాన్


కామెంట్‌ను పోస్ట్ చేయండి