Type Here to Get Search Results !

మెదక్‌లో SIR ప్రక్రియపై బీజేపీ నేతల క్షేత్రస్థాయి పరిశీలన


మెదక్ పట్టణ బూత్‌లలో SIR ప్రక్రియను పరిశీలించిన బీజేపీ నాయకులు

తెలుగు ట్రెండ్స్ | మెదక్ డెస్క్

మెదక్: భారతీయ జనతా పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలోని 135, 148, 165, 166 బూత్‌లలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా BLOలు, BLA-2లతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ఓటర్ల వివరాల సేకరణ ప్రక్రియను పరిశీలించారు. ఇప్పటికే సేకరించిన వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడంతో పాటు, ఇంకా నమోదు చేయని వారి వివరాలను సేకరించి పూర్తి సమాచారాన్ని అందించేందుకు BLA-2లు పూర్తి సహకారం అందిస్తారని తెలిపారు. ప్రజలకు ఏవైనా సమస్యలు ఎదురైతే ఫోన్ ద్వారా తెలియజేయాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్ కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ రాగి రాములు, BLA-1 నల్లాల విజయ్, జిల్లా కార్యదర్శి కల్కి నాగరాజ్, మాజీ బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సతీష్ పటేల్, వాణిజ్య విభాగం జిల్లా కన్వీనర్ బజ్జురి బిక్షపతి, అల్లం మధు, అంకం శ్రీనివాస్, సుంకోజి రాజు, ఊరడి విక్రమ్, మేకల దుర్గ, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language