Type Here to Get Search Results !

అందోల్ లో అభివృద్ధి కోసం నిధులు



 ఆందోల్ నియోజకవర్గానికి రూ.100 కోట్ల రోడ్ల అభివృద్ధి పనులకు పరిపాలనా అనుమతి


ఆందోల్: రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రత్యేక చొరవతో ఆందోల్ నియోజకవర్గంలో రూ.100 కోట్ల విలువైన రోడ్ల అభివృద్ధి పనులకు పరిపాలనా అనుమతి లభించింది.


ఈ నిధులతో మక్తాక్యాసారం–మునిపల్లి రహదారిని గార్లపల్లి, అల్లాపూర్ మీదుగా సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్‌గా విస్తరించేందుకు రూ.30 కోట్లు కేటాయించారు.


అలాగే సంగుపేట్–పోచారం రహదారి (0/0 నుంచి 18/0 కి.మీ.) విస్తరణ, బలోపేతంతో పాటు మిన్‌పూర్–ముదిమాణిక్యం రహదారి (0/0 నుంచి 3/3 కి.మీ.)ని డబుల్ లేన్‌గా అభివృద్ధి చేసేందుకు రూ.40 కోట్లు మంజూరు చేశారు.


నార్సింగి–శంకరంపేట రహదారి (0/0 నుంచి 11/0 కి.మీ.) విస్తరణ, బలోపేతంతో పాటు హై లెవెల్ బ్రిడ్జిల నిర్మాణానికి రూ.30 కోట్లు కేటాయించారు.


మొత్తంగా రూ.100 కోట్లతో చేపట్టనున్న ఈ పనులు పూర్తయితే ఆందోల్ నియోజకవర్గంలో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ప్రజలకు సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language