రిపోర్టర్: సత్యనారాయణ
రిటైర్డ్ ఉపాధ్యాయులు వీరయ్యను పరామర్శించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ
తెలుగు ట్రెండ్స్ – అందోలు, ఆగస్టు 24:
సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలోని చౌటకూర్ మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయులు వీరయ్యను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పరామర్శించారు. వీరయ్య నివాసానికి వెళ్లిన మంత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ వీరయ్యతో కొద్దిసేపు మాట్లాడి ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు.
వీరయ్య కుటుంబ సభ్యులతోనూ మంత్రి మాట్లాడి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. వీరయ్య కుమారుడు మర్రి ప్రదీప్ మునిపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ సందర్భంగా స్థానికులు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.


إرسال تعليق