రిపోర్టర్: బి. యాదగిరి
రామాయంపేటలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్‌కు ఘన స్వాగతం
తెలుగు ట్రెండ్స్ – రామాయంపేట, ఆగస్టు 24:
మెదక్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్తున్న టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్‌కుమార్ గౌడ్‌కు రామాయంపేట పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అక్కన్నపేట బైపాస్ వద్ద మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు నాయకత్వంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మహేష్‌కుమార్ గౌడ్‌కు పూలమాలలు వేసి, శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మహేష్‌కుమార్ గౌడ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీ కార్యక్రమాలపై తమ మద్దతును ప్రకటించారు. రామాయంపేటలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేస్తున్నట్లు తెలిపారు.
స్వాగత కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఆంజనేయులు గౌడ్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పోచమ్మల నవనీత గణేష్, కౌన్సిలర్లు గుగులోతు రవి, దేవుని రంజిత్, బైరం స్వప్నకుమార్, కోఆప్షన్ సభ్యులు చింతల రాధాభవాని, మోబిన్ మహమ్మద్ గౌస్, దెమే యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
అలాగే కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బండారి మహేందర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు చింతల స్వప్న స్వామి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మానెగల రామకృష్ణయ్య, ఉమా సంజీవరెడ్డి, మద్దూరు సునీల్‌తో పాటు నిజాంపేట, రామాయంపేట మండలాలకు చెందిన సీనియర్ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
టీపీసీసీ అధ్యక్షుడికి ఘన స్వాగతం పలికిన సందర్భంగా రామాయంపేటలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
రిపోర్టర్: బి. యాదగిరి


إرسال تعليق