మొక్కలు నాటడమే కాదు.. సంరక్షణ కూడా బాధ్యతే!
వన మహోత్సవంలో భాగంగా మల్కాపూర్‌లో ఎవెన్యూ ప్లాంటేషన్
తూప్రాన్ మండలం, ఆగస్టు 22 (తెలుగు ట్రెండ్స్): మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ పిలుపునిచ్చారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మల్కాపూర్ గ్రామంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ఎంతో ముఖ్యమని అన్నారు. భావితరాల మనుగడకు పచ్చదనం, స్వచ్ఛమైన గాలి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటి, వాటిని కాపాడేందుకు బాధ్యత తీసుకోవాలని సూచించారు.
గ్రామంలోని ప్రధాన రహదారుల వెంట మొక్కలు పెంచడం వల్ల పచ్చదనం పెరగడంతో పాటు రహదారులు ఆహ్లాదకరంగా మారుతాయని తెలిపారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించి పెద్ద చెట్టుగా ఎదిగేలా చూడాలని గ్రామ ప్రజలకు సూచించారు.
వన మహోత్సవ కార్యక్రమాన్ని కేవలం మొక్కలు నాటే కార్యక్రమంగా కాకుండా వాటి సంరక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అన్నారు. గ్రామంలో పర్యావరణ పరిరక్షణకు మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మహేశ్వరి, ఉపసర్పంచ్ స్వామి, టెక్నికల్ అసిస్టెంట్ సురేష్, పాలకవర్గ సభ్యులు జిన్న కృష్ణ, మన్నె తిరుపతి, పిట్ల వేణు, రేఖ నాగరాజుగౌడ్, ఫీల్డ్ అసిస్టెంట్ కనకరాజు, మెకిన్ ప్రెసిడెంట్ కరుణాకర్, యువత, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
తూప్రాన్ రిపోర్టర్: ఆర్. చంద్రశేఖర్
తెలుగు ట్రెండ్స్


إرسال تعليق