రిపోర్టర్: సత్యనారాయణ
ముదిరాజ్ జర్నలిస్టుల సంఘం జిల్లా కన్వీనర్‌గా ఆకుల రాంబాబు
సంగారెడ్డి జిల్లా కన్వీనర్‌గా నియామకం.. హర్షం వ్యక్తం చేసిన ముదిరాజ్ జర్నలిస్టులు
తెలుగు ట్రెండ్స్ – అందోలు, ఆగస్టు 24:
బోయిగూడ ముదిరాజ్ భవన్లో ఆదివారం ముదిరాజ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంగారెడ్డి జిల్లా అందోలు నియోజకవర్గానికి చెందిన సీనియర్ జర్నలిస్టు ఆకుల రాంబాబు ముదిరాజ్‌ను సంగారెడ్డి జిల్లా కన్వీనర్‌గా నియమించారు.
ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ.. జిల్లాలోని ముదిరాజ్ జర్నలిస్టులను సమన్వయం చేస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకుల రాంబాబుకు సూచించారు. జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణతో పాటు సంఘాన్ని జిల్లాలో మరింత బలోపేతం చేసేలా పనిచేయాలని కోరారు.
జిల్లా కన్వీనర్‌గా ఆకుల రాంబాబు నియామకం పట్ల ముదిరాజ్ జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఆయన చొరవ చూపుతారనే ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలుగు ట్రెండ్స్ – అందోలు


إرسال تعليق