ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం.. లబ్ధిదారులను అభినందించిన ఆవుల రాజిరెడ్డి

 



పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

వెల్దుర్తి మండలం, ఆగస్టు 23 (తెలుగు ట్రెండ్స్): పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. వెల్దుర్తి మండలం దామరంచ గ్రామంలో నిర్మాణాలు పూర్తైన ఇందిరమ్మ ఇళ్లలో లబ్ధిదారులు గృహప్రవేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆవుల రాజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులను అభినందించారు.

ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండటం వారి హక్కు అని అన్నారు. ఎన్నో ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా శాశ్వత నివాస సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని తెలిపారు.

నర్సాపూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అర్హులైన పేద కుటుంబాలను గుర్తించి వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా నిరంతరం పర్యవేక్షిస్తానని పేర్కొన్నారు.

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, పేదల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఆవుల రాజిరెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు పేద కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని చెప్పారు.

సొంత ఇల్లు కల్పించడం ద్వారా పేద కుటుంబాలకు భద్రతతో పాటు ఆత్మవిశ్వాసం, సామాజిక గౌరవం పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కొత్త ఇళ్లలో గృహప్రవేశాలు చేసిన లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమ సొంతింటి కల సాకారం కావడం సంతోషంగా ఉందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నరేందర్ రెడ్డి, దామరంచ సర్పంచ్ నాగమణి, విట్టల్ గౌడ్, తలారి మల్లేశం, నర్సింహారెడ్డి, దామరంచ మాజీ సర్పంచ్ శేఖర్ రెడ్డి, ముత్తాబాయి, గ్రామ ప్రజలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

తెలుగు ట్రెండ్స్ – వెల్దుర్తి

0/Post a Comment/Comments

ads

ads