రిపోర్టర్: సత్యనారాయణ
స్మశాన వాటికలో మొక్కలు నాటిన యువకులు
తెలుగు ట్రెండ్స్ – అందోలు, ఆగస్టు 24:
సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలోని స్మశాన వాటికలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో యువకులు మొక్కలు నాటారు. గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా, పచ్చదనంతో ఉంచాలనే ఉద్దేశంతో యువకులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువకులు మాట్లాడుతూ.. గ్రామ స్మశాన వాటికను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. స్మశాన వాటిక బాగుంటే గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
స్మశాన వాటికలో పేరుకుపోయిన అనవసరమైన పిచ్చి మొక్కలను తొలగించి, విశాలంగా ఉన్న ప్రదేశంలో వివిధ రకాల మొక్కలను నాటినట్లు తెలిపారు. నాటిన మొక్కలను సంరక్షించడంతో పాటు వాటి పెరుగుదలకు అవసరమైన చర్యలు తీసుకుంటామని యువకులు తెలిపారు.
వైకుంఠధామంలో మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించేందుకు ముందుకు వచ్చిన యువకులను గ్రామస్తులు అభినందించారు. ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లో యువత మరింత చురుగ్గా పాల్గొనాలని కోరారు.


إرسال تعليق