బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఏడుపాయల శ్రీనివాస్ గౌడ్
పాపన్నపేట, ఆగస్టు 23 (తెలుగు ట్రెండ్స్): పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి దుర్గయ్య అకాల మరణంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. నిరుపేద కుటుంబానికి చెందిన దుర్గయ్య మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా బాధపడుతున్నారు.
ఈ విషయం తెలుసుకున్న ఏడుపాయల శ్రీనివాస్ గౌడ్ తక్షణమే స్పందించి ఆదివారం నాగసానిపల్లి గ్రామానికి వెళ్లి దుర్గయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకుని, బాధిత కుటుంబానికి తనవంతు సహాయంగా రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. దుర్గయ్య మృతి కుటుంబానికి తీరని లోటని, ఆయన కుటుంబానికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కష్టకాలంలో ఉన్న కుటుంబాలకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. బాధిత కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా అవసరమైన సహాయం అందించేందుకు ముందుంటామని భరోసా ఇచ్చారు.
అనంతరం కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయం అందించిన శ్రీనివాస్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు దండోల్ల సామెల్, వార్డు మెంబర్ మన్నె శ్రీనివాస్, వెంకట గాంధీ, ఎం.డి. ఉస్మాన్, వార్డు మెంబర్ కుమ్మరి ఏగొండతో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.


إرسال تعليق