రిపోర్టర్: బి. యాదగిరి
ప్రజావాణికి 10 దరఖాస్తులు
తెలుగు ట్రెండ్స్ – రామాయంపేట, ఆగస్టు 24:
రామాయంపేట మండల పరిధిలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 10 దరఖాస్తులు అందాయి. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజలు సంబంధిత అధికారులకు దరఖాస్తులు సమర్పించారు.
అందిన దరఖాస్తుల్లో మహిళా, శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన ఒక దరఖాస్తు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఆరు దరఖాస్తులు, భూ సమస్యలకు సంబంధించిన మూడు దరఖాస్తులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురాగా.. సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యలను పరిశీలించి నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.
ప్రజావాణి ద్వారా అందిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అర్హత, ప్రభుత్వ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రజినీకుమారి, ఎంపీడీవో సాజలోద్దీన్, మున్సిపల్ కమిషనర్ రవీందర్‌తో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రిపోర్టర్: బి. యాదగిరి


إرسال تعليق