స్పీడ్ పోస్ట్‌తో దేశవ్యాప్తంగా గంజాయి రవాణా.. హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
హైదరాబాద్, జూలై 2: స్పీడ్ పోస్ట్, కొరియర్ సేవలను ఉపయోగించి దేశంలోని 21 రాష్ట్రాలకు గంజాయిని అక్రమంగా సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (H-NEW) పోలీసులు ఛేదించారు. దర్యాప్తులో భాగంగా జార్ఖండ్‌కు చెందిన ప్రధాన నిందితుడు సత్యం మిశ్రాను అరెస్ట్ చేయగా, అతని సహచరులు శుభమ్ మిశ్రా, రాహుల్ ఝా, సచిన్ మిశ్రా, సంతోష్ పండిట్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసులో హైదరాబాద్‌లో గంజాయి బుక్ చేసిన ఇద్దరు కొనుగోలుదారులు సుశాంత్ వ్యాస్ మరియు లడ్డూను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు గంజాయిని "మ్యాంగో", "స్టిక్", "ఫ్లవర్" వంటి కోడ్ పదాలతో గుర్తించి, స్పీడ్ పోస్ట్ ద్వారా మందులు ఉన్న పార్సిళ్లుగా తప్పుడు వివరాలు ఇచ్చి దేశంలోని పలు నగరాలకు పంపినట్లు దర్యాప్తులో వెల్లడైంది. రోజుకు 80 నుంచి 100 ఆర్డర్లు తీసుకుని, నెలకు రూ.30–35 లక్షల వరకు అక్రమ ఆదాయం పొందుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ ముఠాకు సంబంధించిన మరికొంతమంది కోసం గాలింపు కొనసాగుతోందని, పోస్టల్ మరియు కొరియర్ పార్సిళ్ల స్కానింగ్‌ను మరింత కట్టుదిట్టం చేయాలని సంబంధిత కేంద్ర శాఖలకు హైదరాబాద్ పోలీసులు లేఖ రాయనున్నట్లు తెలిపారు.

إرسال تعليق