మెదక్‌లో ఇద్దరు పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్
మెదక్, జూలై 1, 2026: నిబంధనలకు విరుద్ధంగా ఖాళీ స్థలానికి యాజమాన్య ధృవీకరణ, ఇంటి నంబర్ కేటాయింపు, అసెస్‌మెంట్ నిర్వహించిన ఆరోపణలపై శంకరంపేట (ఆర్) గ్రామపంచాయతీకి చెందిన పంచాయతీ కార్యదర్శులు ఆర్. సంతోష్ కుమార్, సీహెచ్. ప్రదీప్ కుమార్లను సస్పెండ్ చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య మాట్లాడుతూ, గతంలో శంకరంపేట (ఆర్) గ్రామపంచాయతీ పరిధిలో వివాదాస్పద స్థలానికి సరైన లింక్ డాక్యుమెంట్లు పరిశీలించకుండా, స్థల పరిశీలన చేపట్టకుండా ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వడం ద్వారా సంబంధిత పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వ నిబంధనలు, విధివిధానాలను పాటించడంలో విఫలమయ్యారని తెలిపారు.
విధుల పట్ల బాధ్యతారాహిత్యం, క్రమశిక్షణా ఉల్లంఘనలకు పాల్పడినందున ఇద్దరు కార్యదర్శులను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు వారు తమ ప్రస్తుత విధి స్థానాలను విడిచి వెళ్లరాదని ఆదేశించారు.


إرسال تعليق