ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫర్టిలిటీ సేవల విస్తరణ.. ప్రైవేట్ ఐవీఎఫ్ సెంటర్లపై కఠిన నియంత్రణకు ప్రభుత్వం సిద్ధం
హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సంతాన సాఫల్య (ఫర్టిలిటీ) వైద్య సేవలను జిల్లాల వరకు విస్తరించడంతో పాటు, ప్రైవేట్ ఫర్టిలిటీ సెంటర్లలో పారదర్శకత, ప్రమాణాల అమలుపై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతున్న , లోని ఐవీఎఫ్ కేంద్రాలు మంచి ఫలితాలు సాధిస్తున్నాయని సమావేశంలో వెల్లడించారు.
ఈ రెండు ప్రభుత్వ ఐవీఎఫ్ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు సుమారు 35 వేల మందికి వైద్య సేవలు అందించగా, ప్రస్తుతం 490 జంటలు ఐవీఎఫ్ చికిత్స పొందుతున్నాయి. చికిత్స చేయించుకున్న వారిలో 23 మంది మహిళలకు గర్భధారణ (ప్రెగ్నెన్సీ పాజిటివ్) నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు.
జిల్లాల ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఫర్టిలిటీ సేవలను విస్తరించే దిశగా చర్యలు వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. అదే సమయంలో ప్రైవేట్ ఫర్టిలిటీ సెంటర్లలో నాణ్యతా ప్రమాణాలు, పారదర్శకతను తప్పనిసరిగా అమలు చేసేలా ప్రభుత్వం కఠిన పర్యవేక్షణ చేపట్టనున్నట్లు వెల్లడించారు.


إرسال تعليق