పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలి మెదక్ కలెక్టర్ ప్రతిభసింగ్

 

మెదక్‌లో రెవెన్యూ పాలనపై కలెక్టర్ ప్రతిమా సింగ్ సమీక్ష.. పెం

డింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

మెదక్, జూలై 1 (తెలుగు ట్రెండ్స్): పారదర్శకతతో కూడిన రెవెన్యూ పాలన లక్ష్యంగా అధికారులు జవాబుదారీతనంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తహసీల్దారులను ఆదేశించారు.

బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్వో అంబదాస్ రాజేశ్వర్, నర్సాపూర్, తూప్రాన్ ఆర్డీవోలు, అన్ని మండలాల తహసీల్దారులతో కలిసి కలెక్టర్ భూభారతి, సాదా బైనామా, ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులు, రెవెన్యూ పాలనపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మండలాల వారీగా భూభారతి, సాదా బైనామా దరఖాస్తుల పురోగతిని పరిశీలించిన కలెక్టర్, భూభారతి పోర్టల్ ద్వారా వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. పట్టాదారు పాస్ పుస్తకాలు, వారసత్వ హక్కులు, సర్వే నంబర్ల వారీగా భూ వివరాల ధృవీకరణ వంటి అంశాలను నిబంధనల ప్రకారం పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

ప్రభుత్వ అవసరాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన భూ సేకరణలో నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అలాగే సాదా బైనామా దరఖాస్తులను జాప్యం చేయకుండా సంబంధిత పత్రాలు, గ్రామ రికార్డుల ఆధారంగా పరిశీలించి పరిష్కరించాలని సూచించారు.

ప్రజావాణిలో పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను కూడా ప్రాధాన్యతతో త్వరగా పరిష్కరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు.

ఈ సమీక్ష సమావేశంలో సంబంధిత తహసీల్దారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

ads

ads