సినిమాల్లో కోట్ల పారితోషికం.. బిజినెస్‌లోనూ సక్సెస్.. తమన్నా సంపాదన వెనక ఇదే సీక్రెట్!

ముంబై: దాదాపు రెండు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో అగ్ర కథానాయికగా కొనసాగుతున్న తమన్నా భాటియా.. ఇప్పుడు కేవలం సినిమాల ద్వారానే కాకుండా వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. నటిగా కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటూనే, తెలివైన పెట్టుబడులతో విజయవంతమైన వ్యాపారవేత్తగా కూడా గుర్తింపు పొందుతున్నారు.
ప్రస్తుతం తమన్నా ఒక్కో సినిమాకు సుమారు రూ.3 నుంచి రూ.5 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం ఉంది. వెబ్ సిరీస్‌లు, బ్రాండ్ ఎండార్స్మెంట్లు, ప్రకటనల ద్వారా కూడా ఆమెకు భారీ ఆదాయం వస్తోంది. దీంతో ఆమె వార్షిక ఆదాయం కోట్ల రూపాయల్లోనే ఉంటుందని అంచనా.
సినిమాలతో వచ్చిన ఆదాయాన్ని కేవలం బ్యాంకులో ఉంచకుండా, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం తమన్నా ప్రత్యేకతగా చెప్పొచ్చు. ప్రముఖ షుగర్ కాస్మెటిక్స్ (Sugar Cosmetics) కంపెనీలో ఆమె పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. కంపెనీ విలువ పెరగడంతో ఆమె పెట్టుబడిపై కూడా మంచి లాభాలు వచ్చినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
సినీ రంగంలో స్టార్ హీరోయిన్గా, వ్యాపార రంగంలో తెలివైన ఇన్వెస్టర్‌గా రాణిస్తున్న తమన్నా.. యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అందం, అభినయం మాత్రమే కాదు.. ఆర్థిక ప్రణాళిక, పెట్టుబడుల విషయంలోనూ ముందుచూపుతో వ్యవహరిస్తూ తన విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.

إرسال تعليق