రైతు భరోసాకు రూ.2,450 కోట్లు.. గత ప్రభుత్వ అప్పులపై సీఎం ఫైర్

 

రైతు భరోసా కింద రూ.2,450 కోట్ల విడుదల.. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర అప్పులు రూ.7 లక్షల కోట్లకు చేరాయని సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, జూన్ 30: రైతు భరోసా పథకం కింద తెలంగాణ ప్రభుత్వం మరో విడతగా రూ.2,450 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసింది. ఈ నిధులతో 44.28 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్ర అప్పు రూ.69 వేల కోట్లు మాత్రమే ఉండేదని, అయితే బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అది రూ.7 లక్షల కోట్లకు పెరిగిందని ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల భారాన్ని ప్రస్తుతం తమ ప్రభుత్వం భరిస్తోందని పేర్కొన్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడంతో పాటు రైతులకు సంక్షేమ పథకాలను కొనసాగించడం సవాలుగా మారిందని సీఎం అన్నారు. అయినప్పటికీ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైతు భరోసా నిధులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా "బకాయిలు పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం... కట్టే పాపం మాకా?" అంటూ సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.


0/Post a Comment/Comments

ads

ads