సిగాచి బాధితులకు రూ.1 కోటి హామీ ఏమైంది?.. సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు



హైదరాబాద్ జూన్ 30: సిగాచి పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాద బాధితులకు ప్రకటించిన పరిహారంపై మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.

సరిగ్గా ఏడాది క్రితం సిగాచి పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంలో 54 మంది ప్రాణాలు కోల్పోయారని, అప్పట్లో బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి చొప్పున పరిహారం అందజేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని ఆయన గుర్తు చేశారు.

అయితే, ఏడాది గడిచినా బాధిత కుటుంబాలకు ఆ హామీ పూర్తిగా అమలు కాలేదని హరీష్ రావు ఆరోపించారు. "ముఖ్యమంత్రి మాటకు విలువ లేకపోతే ఎలా? దేవుళ్లపై ఒట్లు వేసి ప్రజలను మోసం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకోలేదు" అంటూ ఆయన విమర్శించారు.

బాధిత కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే ప్రకటించిన పరిహారాన్ని అందించి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.                                     తెలుగు ట్రేండింగ్ 


0/Post a Comment/Comments

ads

ads